హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రాజకీయంగా ఎదుర్కొలేకే నాపై తప్పుడు ఆరోపణలు'

MNCL: బెల్లంపల్లి పట్టణం 12వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు నెల్లి రమేష్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. శనివారం మాట్లాడుతూ.. ఇళ్లు నిర్మిస్తానని చెప్పి రూ.75 లక్షలు వసూలు చేశానంటూ బూసి రాజన్న కుటుంబం చేస్తున్న ప్రచారం కేవలం అసత్యమని ఆయన మండిపడ్డారు. రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే ఎలాంటి చట్టపరమైన చర్యలకైనా సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు.