హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చిన్న వివాదాలను పెద్దవి చేసుకుని నష్టపోవద్దు'

SRCL: చిన్న వివాదాలను పెద్దవి చేసుకుని నష్టపోవద్దని, రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ.నీరజ అన్నారు. శనివారం కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభించారు. పెండింగ్, ప్రీ లిటిగేషన్ కేసులకు లోక్ అదాలత్ మంచి వేదికని, కుటుంబ, ఆస్తి వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.