హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ASF: కెరమెరి మండలంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రాజు సూచించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాగు పరివాహక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాగులు, కల్వర్టులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.