హైదరాబాద్: 28°C
తెలంగాణ

లంబాడలకు ఇళ్లు ఇవ్వబోమంటూ బోర్డు.. పోలీసులకు ఫిర్యాదు

MBNR: మహబూబ్‌నగర్‌లో లంబాడ కులానికి ఇళ్లు అద్దెకు ఇవ్వబోమంటూ బోర్డు ఏర్పాటు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బంజారా సేవాదళ్ నాయకులు శనివారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుల వివక్షను ప్రోత్సహించేలా బోర్డు ఏర్పాటు చేయడం అభ్యంతరకరమని పేర్కొంటూ, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.