BHPL:టేకుమట్ల మండల కేంద్రంలో వీధికుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహనదారులను కుక్కలు వెంబడిస్తుండటంతో ప్రమాదాల ముప్పు ఉందన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వీధికుక్కల బెడదను నియంత్రించాలని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు.
తెలంగాణ
వీధికుక్కలతో బెడద.. ప్రజలకు భయాందోళన


