ASR: వినాయకచవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ కోరారు. కలెక్టరేట్‌లో సిబ్బందికి మట్టి వినాయక ప్రతిమలను ప్రదర్శించి పంపిణీ చేశారు. పీఓపీ విగ్రహాల నిమజ్జనంతో నీటి వనరులు కలుషితమై జలచరాలకు హాని కలుగుతుందన్నారు. పిల్లలు మట్టి విగ్రహాలు తయారుచేయడం వల్ల సృజనాత్మకత, పర్యావరణ బాధ్యత పెరుగుతాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి వినాయకుడినే పూజిద్దాం: జేసీ


