హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విగ్రహాలతో నిండిపోయిన వీధులు

ATP: అనంతపురంలో ఏ వీధిలో చూసిన గణనాథుడి విగ్రహాలే దర్శనమిస్తున్నాయి. వినాయక చవితికి రెండు రోజులే ఉండడంతో వ్యాపారులు ప్రధాన వీధుల్లో గణనాథుడి విగ్రహాలు విక్రయానికి పెట్టారు. అంతేకాకుండా పూలు చెరుకు గడలు, వెలక్కాయలు, స్వామివారికి ఉపయోగించే అరటి ఆకులు గరిక వీధిలో పెట్టుకొని అమ్ముతున్నారు. నగరవాసులు వ్యాపారులతో లంబోదరుడిని తీసుకువెళుతున్నారు.