హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొలంలో తవ్వకాలపై బాధితుడి ఆవేదన

MBNR: పట్టణ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్‌లో తమ పట్టా పొలంలో వినాయక నిమజ్జనం కోసం అధికారులు అనుమతి లేకుండా తవ్వకాలు జరుపుతున్నారని పట్టాదారుడు హరిబాబు ఆరోపించారు. తవ్వకాలు ఆపాలని వేడుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పొలంలో తవ్వకాలు జరపడం ఏంటని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.