హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్

MDK: పాపన్నపేట మండలం లక్ష్మీనగర్‌లోని పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ నాగేష్ శనివారం పరిశీలించారు. జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక క్యాంపెయిన్ డే కార్యక్రమంలో భాగంగా ఆయన పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు అందుతున్న సేవలు, ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియ, ప్రత్యేక ప్రచార కార్యక్రమాల తీరును ఆయన పరిశీలించారు.