హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీపీఎస్ అంశంలో ప్రభుత్వ వైఖరి తగదు'

NTR: నందిగామలో జరిగిన ఎస్‌టీయూ జిల్లా సమావేశంలో సీపీఎస్ రద్దు, మెరుగైన పెన్షన్ విధానం అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి కార్యాచరణ ప్రకటించాలన్నారు. కేజీబీవీ, డీఎస్సీ ఉపాధ్యాయులకు ఎంటీఎస్, 62 ఏళ్ల పదవీ విరమణ, ఆర్థిక బకాయిల చెల్లింపు, బోధనేతర పనుల భారం తగ్గించాలని సమావేశం తీర్మానించింది.