హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పర్యావరణహిత వినాయక చవితి జరుపుకుందాం'

HNK: హన్మకొండ పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద శనివారం ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రావు పద్మ హాజరై, మాట్లాడారు. భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణపై బాధ్యత చూపాలని సూచించారు. మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణహితంగా పండుగ జరుపుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.