హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణపతి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి: సీఐ

కృష్ణా: అవనిగడ్డ సర్కిల్ పరిధిలో గణేశ్ మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని సీఐ యువకుమార్ తెలిపారు. నిర్వాహకులు ganeshutsav.net వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని అనుమతి పొందవచ్చన్నారు. మండపాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, బాణాసంచా వినియోగంపై నిషేధం ఉందని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.