కృష్ణా: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కొడాలికి చెందిన తుమ్మల లక్ష్మి సుజాత కుటుంబం 220 గ్రాముల బరువైన రూ.30 లక్షల విలువైన బంగారు నాగపడగను కానుకగా సమర్పించింది. ఆలయ సూపరింటెండెంట్ అమృత మధుసూదన్ రావుకు దాతలు దీన్ని అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అధికారులు దాతలను సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
స్వామివారికి బంగారు నాగపడగ కానుక


