హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన భవనంలో భక్తులకు అన్నప్రసాదం

NTR: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గ మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం నూతన భవనంలో శనివారం నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. ఆగస్టు 22న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించగా, శనివారం ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.