KDP: సిద్ధవటం మండలం పేరయ్యగారిపల్లెలో గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు పంట పొలాల్లో మోటార్లకు సంబంధించిన విద్యుత్ వైర్లను చోరీ చేశారు. సుమారు రూ.35 వేల విలువైన వైర్లు అపహరణకు గురైనట్లు రైతు రావూరు సుబ్బారెడ్డి తెలిపారు. చోరీలను అరికట్టేందుకు పోలీసులు నిఘా పెంచాలని రైతులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వైర్ల చోరీతో రైతుల ఆవేదన


