హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్తు మందుల విక్రయాలపై కొరడా

NTR: కంచికచర్ల పట్టణంలో యువతను వ్యసనపరులుగా మార్చే మత్తు మందుల అక్రమ విక్రయాలపై ఆహార, ఔషధాల ప్రామాణిక సంస్థ డ్రగ్స్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం, బిల్లులు ఇవ్వకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన బాబా ప్యాన్సీ అండ్ మెడికల్ షాపు రికార్డులను నందిగామ కోర్టుకు సమర్పించారు.