హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

NMMS పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

ASR: 8వ తరగతి విద్యార్థులకు NMMS-2026-27 స్కాలర్‌షిప్ పరీక్ష నవంబర్ 15న నిర్వహించనున్నట్లు డీఈవో భానుమూర్తిరాజు శనివారం తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మండల పరిషత్, ఎయిడెడ్, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల విద్యార్థులు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50లక్షల్లోపు ఉండాలన్నారు. అక్టోబర్ 12వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.