హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫ్లైఓవర్ వద్ద మూడు కార్లు ఢీ

E.G: రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ సమీపంలో శనివారం మూడు కార్లు వరుసగా ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న మొక్కజొన్న లోడు జీపు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక కార్లు ఢీకొన్నాయి. కార్ల ముందు భాగాలు దెబ్బతినడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.