ADB: గ్రామాల్లో ఆలయాల అభివృద్ధితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. శనివారం బోథ్ మండల కేంద్రంలో పంచముఖి హనుమాన్ మందిరంలో నూతనంగా నిర్మించిన షెడ్డును స్థానికులతో కలిసి ఆయన ప్రారంభించారు. గ్రామస్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు.
వార్తలు
ఆలయాల అభివృద్ధితో ఆధ్యాత్మిక వాతావరణం: ఆడే గజేందర్


