W.G: తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో శనివారం MLA బొలిశెట్టి శ్రీనివాస్ 38 మంది లబ్ధిదారులకు రూ.42,46,831 విలువైన CM సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,138 మందికి ఈ సాయం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కాశి, ప్రసాద్, పండు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


