హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభించిన మంత్రి

ప్రకాశం: ఒంగోలులోని GGH ఆవరణలో రూ.23 కోట్లతో నూతనంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను మంత్రి స్వామి, MLA దామచర్ల జనార్దన్ కలిసి ప్రారంభించారు. శనివారం మంత్రి, ఎమ్మెల్యే ఐసీయూ వార్డులు, అత్యవసర వైద్య పరికరాలు, ఆక్సిజన్ యూనిట్ పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.