CTR: ప్రజల వైద్య అవసరాలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శనివారం ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐదుగురికి రూ.8.60 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజల వైద్య ఖర్చులకు సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ


