హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెంట్ కట్.. నీటి సరఫరా బంద్

KDP: మైలవరం డ్యాం నుంచి ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీరు సరఫరా అవుతోంది. మైలవరంలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రొద్దుటూరుకు తాగునీరు సరఫరాలో ఇబ్బందులు కలుగుతున్నాయి. చిన్నపాటి గాలివానకు సైతం మైలవరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. 24/7 విద్యుత్ పీడర్ ఏర్పాటు చేస్తే ప్రొద్దుటూరు నీటి కష్టాలు తీరుతాయన్నారు.