హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మట్టి వినాయక ప్రతిమలనే పూజిద్దాం'

KDP: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని TDP పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి పిలుపునిచ్చారు. పులివెందులలో జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి భక్తులకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. పీవోపీ, రసాయన రంగులతో తయారైన విగ్రహాల నిమజ్జనం వల్ల నీరు కలుషితమవుతుందని, పర్యావరణహిత మట్టి విగ్రహాలనే వినియోగించాలని కోరారు.