హైదరాబాద్: 28°C
క్రీడలు

WCL 2026: భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2026 షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇక క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసే భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబరు 10న జరగనుంది. దుబాయ్ స్టేడియం వేదికగా రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే, గత సీజన్‌లో రెండుసార్లు పాక్‌తో ఆడేందుకు భారత్ విముఖత చూపించింది. దీంతో ఈసారి ఏమవుతుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.