ELR: ఉంగుటూరు మండలం నారాయణపురంలో వర్తక సంఘం, గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే 74వ గణేష్ ఉత్సవాలకు శనివారం రాట పాతి పనులు ప్రారంభించారు. ఈనెల 14 నుంచి 27 వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని వర్తక సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. ప్రతిరోజు గణనాథుడికి పత్యేక పూజలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. 24 ఊరేగింపు, 27న భారీ అన్న సమారాధన ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ ఉత్సవాలకు సన్నాహాలు


