హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షంతో ఆటోనగర్‌లో నిలిచిన పనులు

NTR: విజయవాడ ఆటోనగర్‌కు శనివారం కురిసిన భారీ వర్షం తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఆటోనగర్లోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్క్ షాపులు, ఆటోమొబైల్ షాపుల వద్దకు నీరు చేరడంతో జాగ్రత్తగా ఉండాలని కార్మికులు తెలిపారు.