ASR: జీకేవీధి (మం) మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ జీతాలు, కూరగాయల బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు కే. కుమారి డిమాండ్ చేశారు. రింతాడ యూపీ స్కూల్‌లో శనివారం కార్మికుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించడంతో పాటు కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. సమావేశంలో మండల నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జీతాలు, బిల్లులు వెంటనే మంజూరు చేయాలి'


