హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాత్రి 10 గంటల తర్వాత డీజేలు బంద్: సీఐ

SS: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని ముదిగుబ్బ సీఐ కే. రామసుబ్బయ్య సూచించారు. ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం విగ్రహాల నిర్వాహకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత పాటించాలని, ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు. రాత్రి 10 గంటల తర్వాత డీజేలు వినియోగించరాదని స్పష్టం చేశారు.