ELR: ఉంగుటూరు మండలం నాచుగుంట శివారు గుళ్లపాడు అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషణ మాసం కార్యక్రమం జరిగింది. ఏఎన్ఎం దేవి దుర్గ ఆధ్వర్యంలో తల్లులకు పౌష్టికాహారం, అంగన్వాడీలో ఇచ్చే పాలు, గుడ్లు, బాలామృతం వాడకంపై అవగాహన కల్పించారు. మునగాకులో అధిక పోషకాలు ఉంటాయని అంగన్వాడీ కార్యకర్త పెద్దింట్లమ్మ తెలిపారు. అంగన్వాడీ , ఆశా కార్యకర్తలు తల్లులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీలో జాతీయ పోషణ మాసం కార్యక్రమం


