హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిబంధనలు పాటిస్తూ వినాయక చవితిని జరుపుకోవాలి'

ELR: ప్రజలకు అసౌకర్యం కలగకుండా, భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ ఉత్సవ కమిటీలకు సూచించారు. స్థానిక ట్రాఫిక్ కౌన్సిలింగ్ సెంటర్‌లో ఎస్సైలు రామకృష్ణ, మధు, వెంకటరాజాలతో కలిసి నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉన్నందున, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.