హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా ఉద్యమాల నేత ఏచూరికి ఘన నివాళి

కడపలో సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సంస్మరణ సభను శనివారం నిర్వహించారు. యూటీఎఫ్ భవన్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏచూరి చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన రాజకీయ జీవితం, ప్రజా ఉద్యమాలకు చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. సీపీఎం సీనియర్ నాయకుడు కందారపు మురళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.