హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KDP: పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఎంతో ఉపయోగపడుతుందని కడప MLA మాధవి అన్నారు. శనివారం కడపలోని తన కార్యాలయంలో 21 మంది లబ్ధిదారులకు రూ.14.27 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో పేదలకు CMRF ద్వారా CM చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. పేదల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని MLA పేర్కొన్నారు.