హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి'

ELR: జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో పట్టణ టీడీపీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల చేపట్టిన 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమానికి వచ్చిన స్పందన, స్థానిక సమస్యలపై నాయకులు విస్తృతంగా చర్చించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి వార్డులోనూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నేతలు సూచించారు.