KNR :కరీంనగర్ సీతారాంపూర్ 23వ డివిజన్‌లో కార్పొరేటర్ గుమ్మడి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. రసాయన విగ్రహాలకు బదులు మట్టి విగ్రహాలను పూజించి ప్రకృతిని కాపాడాలని సూచించారు. అనంతరం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
సీతారాంపూర్‌లో మట్టి వినాయకుల పంపిణీ


