ELR: సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి జంగారెడ్డిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో చల్లారి మాణిక్యాలరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఏచూరి విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తుచేశారు. రాజ్యసభ సభ్యుడిగా, 'ఇండియా' కూటమి ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏచూరి సేవలను స్మరించుకున్న నేతలు


