హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తోటపాలేం పంచాయతీగా కొనసాగించాలి'

SKLM: ఎచ్చెర్ల (మం) తోటపాలేం పంచాయతీని కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దని, పంచాయతీగానే కొనసాగించాలని గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు మేరకు ఎంపీడీవో హరిహరరావు శనివారం విచారణ నిర్వహించారు. విలీనంతో NREGS పనులు, ఉపాధి కోల్పోతామని, పన్నుల భారం పెరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. అఖింఖాన్‌పేటను ప్రత్యేక పంచాయతీగా చేయాలని కోరారు.