కృష్ణా: రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 16న బంటుమిల్లి ఎంపీడీవో కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అశోక్ తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వివరాలను నేతలకు వెల్లడిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
16న బంటుమిల్లిలో అఖిలపక్ష సమావేశం: MPDO


