కృష్ణా: మచిలీపట్నంలో పలు వార్డుల్లో చెత్త సమస్య రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. ఎక్కడ చెత్త అక్కడే నిల్వ ఉండిపోతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో చెత్తను తరలించే ట్రాక్టర్లు, ఇతర వాహనాలు అందుబాటులో లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పేరుకుపోయిన చెత్త.. ప్రజలకు ఇబ్బందులు


