శ్రీకాకుళం (M) రాగోలు లోని లక్ష్మీనగర్ కాలనీ రోడ్డు పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే శంకర్ శనివారం పరిశీలించారు. మట్టి రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో ప్రజల రాకపోకలకు కలుగుతున్న అసౌకర్యాన్ని స్వయంగా పరిశీలించారు. వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే


