హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీహెచ్‌సీ ఎదుట అధ్వాన్నంగా పారిశుద్ధ్యం

NTR: జి.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట చెత్త, మురుగునీరు పేరుకుపోయి పరిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈగలు, దోమల బెడదతో డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.