ATP: గుత్తిలోని వాసవి బజారులో వెలసిన శ్రీ వరసిద్ధి విగ్నేశ్వర ఆలయంలో శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి వేకువజామున సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం


