హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గజపతినగరం కోర్టులో జాతీయ లోక్ అదాలత్

VZM: గజపతినగరం కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎం.రోహిణిరావు మాట్లాడుతూ.. రాజీయే రాజమార్గం అన్నారు. చిన్న చిన్న తగాదాలకు కోర్టులను ఆశ్రయించరాదని సూచించారు. కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రాంబాబు పాల్గొన్నారు.