SKLM: కొత్తూరు మండలంలోని వసప గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.40 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు గ్రామ నాయకులు, కార్యకర్తలు ఇవాళ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. నిధుల మంజూరుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు'


