GDWL: గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో అలంపూర్ మున్సిపల్ కమిషనర్ రాజేశ్ మండపాల కమిటీ అధ్యక్షులకు పలు సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వీటిని వినియోగించడం ద్వారా నిమజ్జన సమయంలో నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. మండపాల వద్ద పరిశుభ్రత పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.
తెలంగాణ
మట్టి గణేశ్ విగ్రహాలతో కాలుష్య నివారణ


