AP: రాష్ట్ర గ్రీన్ బోర్డు ఛైర్మన్‌గా తనకు అప్పగించిన పదవికి న్యాయం చేస్తానని నాగబాబు తెలిపారు. APలో ప్రస్తుతం 29 శాతమే పచ్చదనం ఉందని.. 2047 నాటికి 50% పచ్చదనమే లక్ష్యమని ప్రకటించారు. APలో పచ్చదనం పెంపునకు చర్యలు చేపడతామని చెప్పారు. స్థానిక ఎన్నికలపై పార్వతీపురంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో నాగబాబు పాల్గొన్నారు. పోటీ చేసే స్థానాలపై త్వరలో ప్రకటన ఉంటుందన్నారు.
వార్తలు
2047 నాటికి 50% పచ్చదనం లక్ష్యం: నాగబాబు


