భోజనం చేశాక ఛాతిలో మంట రావడం సాధారణంగా అసిడిటీ వల్ల జరుగుతుంది. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక, కడుపులోని ఆమ్లాలు పైకి తన్నడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. కారంగా, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. కొద్దిగా నీరు తాగాలి. సమస్య తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి.
ఆరోగ్యం
భోజనం చేశాక ఛాతిలో మంటగా ఉంటుందా..?


