హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నరాల బలహీనత తగ్గాలంటే?

పల్లెటూర్లలో సంప్రదాయంగా తయారుచేసే వట్టి తునకలు, అంటే ఎండబెట్టిన మటన్ ముక్కలు, ఎక్కువకాలం నిల్వ చేసుకునే పద్ధతి. మటన్‌లో ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్‌ B12 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి నరాల బలహీనత, రక్తహీనత నివారణలో సహాయపడతాయి. అయితే ఎండబెట్టిన మాంసంలో ఉప్పు ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి పరిమితంగా తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలున్నవారు వైద్యుల సలహాతో తీసుకుంటే మంచిది.