హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కళ్లకు మేలు చేసే ఆహారాలు ఇవే?

కంటి ఆరోగ్యానికి అవిసె గింజలు, గుమ్మడి గింజలు, జనపనార విత్తనాలు, పొద్దుతిరుగుడు పప్పు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలోని ఒమేగా-3, జింక్, లూటిన్, జియాక్సాంతిన్, విటమిన్లు సి, ఇ, ఏ కంటి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. జామ, ఉసిరి, మునగాకు, కరివేపాకు, కొత్తిమీర కూడా మేలు చేస్తాయి. అయితే ఇవి కళ్లజోడును తొలగిస్తాయనే హామీ లేదని నిపుణులు చెబుతున్నారు.