హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

NRPT: ఊట్కూరు మండలం పెద్దజట్రంలో శ్రావణమాసం సందర్భంగా శనివారం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ వాకిటి వెంకటేశ్, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.